తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనానికి హేతువైంది. తెలంగాణ రాష్ట్రం రేపో మాపో ఏర్పడుతుందని ప్రకటించడం కెసిఆర్ కు అలవాటేనని ఎంత అనుకున్నా ఈసారి ఆయన చేసిన ప్రకటనలో వాస్తవం ఉండే అవకాశాలున్నట్లు...